Home  »  TV News  »  Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ లవ్ స్టోరీలో బిగ్ ట్విస్ట్.. ఆ యంగ్ యాంకర్ తో..!

Updated : Apr 14, 2026

- సుధీర్, రష్మీ ఫ్యాన్స్ కు బిగ్ షాక్!
- దీపికా పిల్లితో సుధీర్ ప్రేమాయణం?
- ఆ ఫోటో వెనుక అసలు కథ ఏంటి?

బుల్లితెరపై సుడిగాలి సుధీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా రష్మీ గౌతమ్‌తో ఆయనకు ఉన్న ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఎన్నో ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అయితే తాజాగా సుధీర్ లవ్ స్టోరీలో ఊహించని బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించింది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటో
రీసెంట్ గా సుధీర్, యంగ్ యాంకర్ దీపికా పిల్లి అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది. రష్మీతో సుధీర్ ట్రాక్ నడుస్తుందని భావిస్తున్న అభిమానులకు, ఈ ఫోటో చూసి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యింది. స్వయంగా దీపికా పిల్లి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ ఫోటోను షేర్ చేయడంతో, వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ప్రచారం జోరుగా సాగింది. సుధీర్ ఫ్యాన్స్ కూడా ఈ ట్విస్ట్‌ను జీర్ణించుకోలేకపోయారు.

అసలు ట్విస్ట్ ఇదే.. దీపికా పిల్లి క్లారిటీ
ఈ వైరల్ ఫోటోపై తాజాగా దీపికా పిల్లి స్పందిస్తూ అసలు విషయాన్ని బయటపెట్టింది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని, తన స్టోరీలో షేర్ అయిన ఆ ఫోటోతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేసింది. ముఖ్యంగా ఆ ఫోటో నిజమైనది కాదని, అది AI ద్వారా క్రియేట్ చేసిన ఫోటో అని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

తన అనుమతి లేకుండా ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఈ పని చేశారని, గత 24 గంటల్లో తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ అయిన కంటెంట్‌ను ఎవరూ నమ్మవద్దని ఆమె కోరింది. ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నానని, దీనిని పెద్దగా పట్టించుకోవద్దని ఆమె వివరణ ఇచ్చింది.

మళ్ళీ తెరపైకి సుధీర్ - రష్మీ ట్రాక్
దీపికా పిల్లి ఇచ్చిన క్లారిటీతో సుధీర్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఏఐ జనరేటెడ్ ఫోటో వివాదం కారణంగా సుడిగాలి సుధీర్ మరోసారి నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఎప్పటిలాగే రష్మీ గౌతమ్ పేరు మళ్ళీ తెరపైకి వచ్చింది. ఆన్-స్క్రీన్‌పై వీరిద్దరి జోడీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఇలాంటి పుకార్లు వచ్చిన ప్రతిసారీ ఫ్యాన్స్ అలర్ట్ అవుతున్నారు. 

సుధీర్ - రష్మీ పెళ్లి చేసుకోవాలని కోరుకునే అభిమానులు ఎందరో ఉన్నారు. అయితే తమ మధ్య ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉందని, ప్రొఫెషన్ లో భాగంగానే ఆన్-స్క్రీన్ లో అలా కనిపిస్తామని ఇప్పటికే సుధీర్ - రష్మీ ఇప్పటికే పలుసార్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.